టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున ఈ మూవీలో డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. `సుకుమార్ పుష్ప లైన్‌ని 10 నిమిషాలు చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. పుష్పరాజ్ జీవితంలో జరిగే కథే ‘పుష్ప’ చిత్రం. ఈ పాత్ర చాలా అనుభూతులు ఇచ్చింది. స్పెషల్ మేకప్ గురించి, కొత్త యాస గురించి తెలిసింది. రష్మిక నటన, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.` అంటూ బన్నీ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ సందర్భంగా బన్నీ తన ఫ్యాన్స్‌తో ఓ అదిరిపోయే విషయాన్ని కూడా పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. దర్శకధీరుడు రాజమౌళితో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ.. `ప్రి రిలీజ్ లో రాజమౌళిగారి మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఆయన నా గురించి నిజాయతీగా మాట్లాడారు.
అయితే ఇంత వరకూ ఎవరిని నేను అడగలేదు.. కాని ఆయనతో అన్నా.. మీతో సినిమా చేయాలని ఉంది అని. దానికి రాజమౌళి గారు కూడా నేను సినిమా చేయాలి అనుకుంటున్న హీరోలలో నువ్వు కూడా ఉన్నావ్.. త్వరలో చేద్దాం` అన్నారని పేర్కొన్నాడు. ఇక ఈయన మాటల బట్టీ చూస్తుంటే త్వరలోనే రాజమౌళి-బన్నీల ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ రావడం ఖాయమని అర్థమైంది.