న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే మంగళవారం వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో రాయల్ ఈవెంట్ నిర్వహించగా.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మాత దిల్‌రాజు శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అదిరిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. `ఎంసీఏ` చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు.
`ఎంసీఏ` టైమ్‌లో తాను, సాయిపల్లవి ఇదే గ్రౌండ్‌లో కలిశామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందన్నారు. మళ్లీ అదే కాంబినేషన్‌లో ఈ స్టేజ్‌పై ఉన్నామని అంతకు మించిన రిజల్ట్ ఈ నెల 24న చూడబోతున్నారని నాని తెలిపారు. అలాగే ఇంకో వారం రోజుల్లో పెద్ద సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి.
అయినా ఇంచు భయం కూడా లేదు. ఎందుకంటే చేతిలో ఉన్న సినిమా ఎంత బాగా వచ్చిందో నాకు తెలుసు. అది మీ అందరికి కూడా నచ్చుతుందని నాని చెప్పుకొచ్చారు. మొత్తానికి నాని `ఎంసీఏ` సినిమా సెంటిమెంట్ గనుక వర్కౌటేతే శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.