టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్‌లు ఈ చిత్రంలో విలన్లుగా కనిపించబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం `పుష్ప ది రైజ్` టైటిల్‌తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో పుష్ప టీమ్‌కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే.. పుష్ప విడుదలకు ఇంకా రెండు రోజులే సమయమే మిగిలి ఉంది. అయితే ఇంకా యూఎస్ ప్రీమియర్స్ కి సంబంధించి ఫస్ట్ కాపీ రెడీ కాలేదట. ఈ నేపథంలోనే పుష్ప టీమ్ ఖంగారు పడుతుందని.. ఈ విషయంపై బన్నీ సైతం సుకుమార్‌పై ఫైర్ అయ్యారని టాక్ నడుస్తోంది.
ఇక ఈరోజు సాయంత్రానికి ఫస్ట్ కాపీ పూర్తై వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లాస్ట్ మినిట్ లో ఇలాంటి టెన్షన్స్ సుకుమార్ సినిమాలకి కొత్తేమి కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు ఇటాంటి విషయాలతో తాను ఖంగారు పడి ఫ్యాన్స్‌ను ఖంగారు పెట్టారాయన.