ప‌వ‌న్, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌ ద‌శ మార్చిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల ద‌శా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? శ్రుతీ హాస‌న్‌. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Shruti Hassan game for glamorous roles in her comeback

1 నేనొక్కడినే, ఆగడు చిత్రాల‌తో వ‌ర‌స‌గా ఫ్లాప్స్‌ను ఖాతాలో వేసుకున్న మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంతో `శ్రీమంతుడు` చిత్రం చేశాడు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2015లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో మ‌హేష్ మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.

Mahesh Babu takes the first dose of Covid-19 vaccine; urges everyone to do  so | Telugu Movie News - Times of India

అలాగే కొమరం పులి, తీన్ మార్, పంజా చిత్రాలు చేసి ఫ్లాపుల్లో కూరుకుపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. శ్రుతి హాస‌న్‌తో `గ‌బ్బ‌ర్ సింగ్` చిత్రం చేశాడు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 2012 మే 11న విడుదలైన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని అందుకుని.. ప‌వ‌న్‌కు హిట్ ప‌డేలా చేసింది. అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ మ‌రోసారి శ్రుతి హాస‌న్‌తో `వ‌కీల్ సాబ్‌` చేయ‌గా.. ఈ మూవీ సైతం హిట్టైంది.

Title and first look of Pawan Kalyan and Harish Shankar's PSPK28 out | The  News Minute

ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే.. ఆరెంజ్, ర‌చ్చ‌, నాయ‌క్‌, తుఫాన్ సినిమాల‌తో వ‌రుస‌ అప‌జ‌యాల‌ను అందుకున్న ఈయ‌న శ్రుతి హాస‌న్‌తో క‌లిసి `ఎవ‌డు` చిత్రం చేశాడు. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2014లో విడుద‌లై విజ‌యం సాధించ‌డంతో.. రామ్ చ‌ర‌ణ్ మ‌ళ్లీ స‌క్సెస్ అందుకున్నాడు. మొత్తానికి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ ముగ్గురు హీరోల‌కు హిట్ ఇచ్చి.. ల‌క్కీ హీరోయిన్‌గా మారింది శ్రుతి హాహాన్‌.

Ram Charan resumes shoot of 'Acharya' | Celebrities News – India TV