ఆ స్టార్ హీరో కూతురితో బ‌న్నీ ల‌వ్ ఎఫైర్‌..అప్ప‌ట్లో ఇదే హాట్ టాపిక్‌?

November 24, 2021 at 7:36 pm

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బ‌న్నీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మార‌బోతున్న‌ బ‌న్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి.

Allu Arjun shares COVID-19 health update, says he is recovering | The News  Minute

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌తో బ‌న్నీ ప్రేమ‌లో ప‌డిన‌ట్లు జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. బ‌న్నీ, శ్రుతిలు జంట‌గా `రేసుగుర్రం` చిత్రంలో న‌టించారు. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2014 ఏప్రిల్ 11న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Allu Arjun

ఇక ఈ చిత్రం త‌ర్వాత అల్లు అర్జున్ శృతిహాసన్ ను ఎంత‌గానో ఇష్టప‌డ్డాడ‌ని, కానీ అప్ప‌టికే త‌న‌కు-స్నేహా రెడ్డికి పెళ్లై పోవ‌డంతో శ్రుతి విష‌యంలో సైలెంట్ అయిపోయాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాదు గానీ.. అప్ప‌ట్లో మాత్రం ఇవి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Allu arjun whatsapp status | shruti haasan whatsapp status | Allu arjun and shruti  hasan love scene - YouTube

కాగా, బ‌న్నీ సినిమాల విష‌యానికి ప్ర‌స్తుతం ఈయ‌న‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది-రైస్ ` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌లు ఈ చిత్రంలో విల‌న్‌లుగా క‌నిపించ‌బోతున్నారు.

ఆ స్టార్ హీరో కూతురితో బ‌న్నీ ల‌వ్ ఎఫైర్‌..అప్ప‌ట్లో ఇదే హాట్ టాపిక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts