సరికొత్త లుక్ తో గోపీచంద్ పక్కాకమర్షియల్ మూవీ టీజర్..వైరల్..!

హీరో గోపీచంద్ మొదట విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా వరుస సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు సిటీ మార్ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా టీజర్ విడుదలైంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా మారుతి వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గారి సమర్పణలో తాగుతున్న జి ఎ టు పిక్చర్స్ మూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది.”ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడూ చేసి వదిలేశాను అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో గోపీచంద్ ను అద్భుతంగా డిజైన్ చేసి చూపించారు మారుతి. తన కెరీర్ లో ఇలాంటి స్టైలిష్ లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు హీరో గోపీచంద్. ఈ సినిమాల రాసి కన్నా కూడా మరొకసారి కామెడీతో ప్రేక్షకులను అలరించబోతోంది అన్నట్టుగా కనిపిస్తుంది.