సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. రన్ టైమ్ చూస్తూ షాకే!

November 26, 2021 at 5:53 pm

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘జనని’ అనే ఎమోషనల్ పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా తాజాగా పూర్తయినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చూసిన వారు రాజమౌళి విజన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారట. ఇలాంటి సినిమాలను తీయడంలో రాజమౌళి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని, ఇలాంటి సినిమాలు ప్రస్తుతం చాలా అవసరం అని వారు కితాబిచ్చారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా రన్ టైమ్ మిగతా సినిమాలకంటే కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాలు ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలోని కంటెంట్ మనకు ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చేస్తుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. మొత్తానికి సెన్సార్ బోర్డు నుండి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్ సాధించిన ఆర్ఆర్ఆర్ ఇక రిలీజ్‌కు రెడీ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసి జనవరి 7న బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు రెడీ అవుతున్నారు ఈ చిత్ర యూనిట్.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. రన్ టైమ్ చూస్తూ షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts