`భీమ్లా నాయ‌క్‌`కు త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే అవాక్వ‌వ్వాల్సిందే!?

November 26, 2021 at 6:51 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తి మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు మెయిన్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాక‌పోయినా.. నిర్మాత‌లు మాత్రం ఆయ‌న‌కు ఏకంగా రూ.15 కోట్లు రెమ్యూన‌రేష‌న్‌గా ముట్ట‌చెబుతున్నార‌ట‌.

అంతేకాదు, ఈ సినిమా లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా త్రివిక్ర‌మ్ ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, మలయాళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోశియుమ్`కి రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో.. ప‌వ‌న్ భీమ్ల నాయక్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

అలాగే రానా రిటైర్డ్‌ ఆర్మీ అధికారి డేనియర్‌ శేఖర్ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఐదు రోజులు ముందు అంటే జ‌న‌వ‌రి 7న రాజమౌళి తెర‌కెక్కించిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‌` రిలీజ్ కాబోతోంది. దీంతో భీమ్లానాయక్ వాయిదా ప‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ, నిర్మాతలు మాత్రం అదే డేట్ కు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

`భీమ్లా నాయ‌క్‌`కు త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే అవాక్వ‌వ్వాల్సిందే!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts