`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

November 26, 2021 at 7:21 pm

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయ‌న‌. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్ర‌మే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే క‌నిపించ‌బోతోంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ 83 టీజ‌ర్‌ను వ‌దిలారు. జూన్‌ 25, 1983 లండన్‌లోని లార్డ్స్‌ స్టేడియం వేదిక‌గా వెస్టిండీస్ పై వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా గెలుపునకు సంబంధించిన కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది ఈ టీజర్. ఆ నాటి విజయం తాలూకా ఉత్కంఠను ఈ టీజ‌ర్‌ను అద్భుతంగా చూపించారు.

అలాగే టీజర్ చివర్లో ఇండియా జిందాబాద్ అనే నినాదాలు ఒక్కసారిగా దేశ భక్తిని రగిలించాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, భారీ అంచనాలను ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 30న విడుద‌ల చేయ‌బోతున్నారు.

`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts