ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

November 26, 2021 at 5:19 pm

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా `జనని..` అంటూ సాగే సాంగ్‌ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు.

సోల్ ఆంథమ్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్ పేరుతో జననీ పాటను వ‌దిలారు. అయితే దేశభక్తిని చాటుతూ ఎంతో ఎమోష‌న‌ల్‌గా సాగిన ఈ పాట అంద‌రి చేత కంట త‌డి పెట్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రీయలు భావోద్వేగంతో కూడిన ఎక్స్‌ప్రెష‌న్స్‌తో విక్ష‌కుల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేశారు.

కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. విజువ‌ల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్‌.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts