ఇది వెంకీ మామ టైం …90 స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ రికార్డ్

విక్టరీ వెంకటేష్.. ఆయన పేరు ముందు విక్టరీ అనే పేరు ఆయన సాధించిన విజయాల తోనే వచ్చింది. టాప్ సీనియర్ హీరోల్లో ఎక్కువ విజయాల శాతం ఉన్నది వెంకటేష్ కే. ముఖ్యంగా 90స్ తోపాటు, 2000 తరువాత వెంకటేష్ కు భారీ హిట్స్ వచ్చాయి. ప్రేమించుకుందాం రా..సినిమా నుంచి.. ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వసంతం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, సంక్రాంతి,లక్ష్మి ఇలా వరుసగా వెంకటేష్ సూపర్ హిట్లను అందుకున్నాడు. ఘర్షణ సినిమా వరకు ఆయన ఫామ్ కొనసాగింది.

2010 తర్వాత ఆయనకు ఎక్కువగా హిట్స్ లేవు. ఆ తర్వాత ఆయన సోలో హీరోగా సినిమాల్లో నటించడం కూడా తక్కువ అయింది. రామ్ తో మసాలా, మహేష్ బాబు తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తో ఎఫ్ -2, నాగచైతన్యతో వెంకీ మామ వంటి మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. ఈ మల్టీ స్టారర్ సినిమాల్లో చాలా సినిమాలు విజయవంతం అయినప్పటికీ ఆయనకు అనుకున్నంత పేరు రాలేదు.

ఎఫ్- 2 మల్టీస్టారర్ సినిమా అయినా తన స్టైల్ కామెడీతో వెంకటేష్ మునుపటి జోష్ చూపించాడు. తాజాగా సోలోగా కూడా వెంకీ రెండు హిట్లు అందుకున్నాడు. నారప్ప, దృశ్యం -2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వెంకీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు మళ్ళీ వరుసగా విజయాలు వస్తున్నాయని ఆనందిస్తున్నారు. వెంకీలో కూడా వరుస విజయాలతో మునుపటి జోష్ కనిపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్- 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా వెంకీకి కచ్చితంగా విజయం అందిస్తుందని ఆయన ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.