ప్రియాంక చోప్రా.. చేతికున్న ఉంగరం ఖరీదు ఎన్ని కోట్లు అంటే..?

మన దేశంలోనే మోస్ట్ లవబుల్ కపుల్స్ జాబితాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ ముందు వరుసలో ఉంటారు. వీరికి వివాహమై దాదాపుగా ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తోంది. ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేసింది. తన వివాహం గురించి, అందుకు సంబంధించిన విషయాల గురించి తెలియజేసింది.

Priyanka Chopra Flaunts Her Engagement Ring And Calls It The Best Piece From Tiffany

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చింది.

Ring-Portrait-Session-Priyanka-Chopra - The Knot News

ప్రియాంక చోప్రాకు ఇష్టమైన వాటిలో తన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఒకటి అని చెప్పుకొచ్చింది. తను ధరించే ఎంగేజ్మెంట్ రింగ్ ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇది ఎప్పుడూ తన చేతి నుండి విడిపోదని చెప్పుకొచ్చింది.

The cost of Priyanka Chopra's engagement ring will shock you! - Times of India

ఇక ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ధర రూ.2 కోట్లకు పైమాటే అని చెప్పింది. ఈ రింగు ఖరీదు తెలిసి ఇండస్ట్రీ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ రింగు తో తన తండ్రి కి కూడా బంధం ఉందని చెప్పుకొచ్చింది.