పిల్లల ప్లానింగ్ విషయంపై..షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనలకు వివాహమై దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఈ జంట పిల్లలకు సంబంధించి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తరా అంటూ మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయంపై మాట్లాడింది. ఆ వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఉపాసన మాట్లాడుతూ..ఈమధ్య పిల్లల గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారని, కానీ నేను ఏ ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయంపై నేను ఏమీ మాట్లాడనా కూడా అది ఒక సెన్సేషనల్ అవుతుందని. అందుచేతనే తనకి ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఈ విషయంపై ఇటు రామ్ చరణ్, ఉపాసన లను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు నెటిజన్స్.