భారీ రేటు ప‌లికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది.

Sarkaru Vaari Paata Birthday Blaster: Mahesh Babu Shares MIND-BLOWING Teaser from his Next!

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాట‌.

Mahesh Babu: Superstar Movie Should Not Be Leaked .. Government Should Be Careful And ... - Mahesh Babus Sarkaru Vaari Paata Movie » Entertainment » Prime Time Zone

ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మొత్తం రూ.15 కోట్ల‌కు సర్కారువారి పాట ఓవర్సీస్ హక్కులను ద‌క్కించుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.