ఎన్టీఆర్ తో..బామ్మ అభిమానం..ఫోటో వైరల్..!

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఈ హీరోని. ఇక అంతే కాకుండా ఎన్టీఆర్ ను చూస్తే తన తాత సీనియర్ ఎన్టీఆర్ చూసినట్లే ఉంటుంది అని కొందరు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన అభిమాని అయిన ఒక బామ్మ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ను చూసి ఆమె ఎంతో మురిసిపోయి, ఆ వెంటనే ఎన్టీఆర్ ను హత్తుకొని ఒక ఫోటో దిగింది . ఇక ఎన్టీఆర్ ఇంట్లో జిమ్ వ్యాయామాలు చేస్తూ ఉండగా ఆయన కుడి చేతి వేలుకు గాయమైన విషయం మనకు తెలిసిందే. అందుకోసం ఎన్టీఆర్ మైనర్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా బామ్మతో దిగిన ఫోటోలు కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతి కట్టుకొని పడుతోంది.

కొన్ని రోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంటివద్దనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.