నానికి త‌ల‌నొప్పిగా మారిన మెగా-నంద‌మూరి హీరోలు..!?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న చివ‌రిగా న‌టించిన వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. అయితే ఈయ‌న తాజాగా న‌టించిన‌ `శ్యామ్ సింగ‌రాయ్` చిత్రం మాత్రం థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది.

Shyam Singha Roy Teaser Talk: Intriguing And Intense

కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

Varun Tej as Ghani, first look unveiled

అయితే ఇలాంటి త‌రుణంలో నానికి మెగా-నంమూరి హీరోలు త‌లనొప్పిగా మారారు. డిసెంబ‌ర్ 24న సోలోగా రావాల‌ని నాని చూడ‌గా.. స‌రిగ్గా అదే తేదీన‌ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త‌న `గ‌ని` చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయిన‌ప్ప‌టికీ నాని వెన‌క్కి త‌గ్గ‌లేదు. `క్రిస్మస్` మనదే అని ఆయన చాలా బలంగా .. దృఢంగా చెప్పాడు.

BIMBISĀRA - #NKR18 Title Reveal | Nandamuri Kalyan Ram | Vashist | Hari Krishna K | NTR Arts - YouTube

అయితే ఇప్పుడు అనూహ్యంగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న `బింబిసార`ను కూడా ఆ తేదీనే రిలీజ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. శ్యామ్ సింగ‌రాయ్, గ‌ని, బింబిసార ఈ మూడు చిత్రాల మ‌ధ్య బాక్సాఫీస్ క్లాషెస్ తీవ్రంగా ఉంటాయి. రాక రాక థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్న నానిని ఇప్పుడు ఈ విష‌య‌మే క‌ల‌వ‌ర పెడుతోంద‌ని టాక్‌.

Share post:

Latest