సర్కారు వారి పాట కోసం తొలిసారి అలా చేస్తోన్న కీర్తి సురేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో తొలిసారి మహేష్-కీర్తి సురేష్‌లు కలిసి నటిస్తుండటంతో, ఈ జంట ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సైతం నెలకొంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ స్వయంగా పాట పడుతుందనే వార్త గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా దీనిపై ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఓ అభిమాని ఈ సినిమాలో కీర్తి సురేష్ పాట పాడుతుందా అని అడగ్గా.. ఆమె పాట పాడటం పక్కనబెడితే ఖచ్చితంగా వయోలిన్ మాత్రం వాయిస్తుందని థమన్ అన్నాడు.

దీంతో ఈ సినిమాలో తొలిసారి కీర్తి సురేష్ నిజంగా వయోలిన్ వాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కీర్తి సురేష్ వయోలిన్ వాయించడం నేర్చుకున్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నిజంగానే వయోలిన్ వాయిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.