దీపావళి వేడుకలో మెరిసిపోతున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక తాజాగా RRR లో నటించిన ఈయన సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఈయన అభిమానులు. అయితే నిన్నటి రోజున దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఘనంగా ఉత్సవాలను జరుపుకున్నట్లు గా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఎన్టీఆర్ కు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టమట. ఈ పండుగని తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను చేసుకున్నారు. తన ఇద్దరు కుమారులతో ట్రెడిషినల్ లుక్ తో దిగినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇద్దరి కొడుకులను చూసిన నెటిజెన్స్ ఎంతో ముద్దుగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి కూడా అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తున్న అటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్గా మారాయి.

https://www.instagram.com/p/CV23QqXvuDm/?utm_source=ig_web_copy_link