ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

November 26, 2021 at 10:16 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది.

తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు గ‌డిచిపోయినా.. ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ ఛ‌త్ర‌ప‌తిని ఆద‌రిస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. ముఖ్యంగా సూరీడు ఓ సూరీడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది.

సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీ గ్యాంగ్ అమానుషంగా కొట్టడంతో.. అప్పటివరకు అణిగిమణిగి ఉన్న ప్రభాస్‌ ఒక్కసారిగా ఉగ్రరూపం ఎత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్‌కు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. అయితే ఈ సినిమాలో సూరీడుగా న‌టించిన బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దొడు అయిపోయాడు. అత‌డి పేరు భశ్వంత్‌ వంశీ.

ఛత్రపతి సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్లి ఫస్ట్ రౌండ్‌లోనే సెలక్ట్ అయిన భ‌శ్వంత్ వంశీ.. సూరీడు పాత్ర‌కు వంద శాతం న్యాయం చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అయితే ప్ర‌స్తుతం సూరీడు గడ్డం, మీసాలతో గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న భ‌శ్వంత్ వంశీ.. ప్ర‌స్తుతం అక్క‌డే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి లేటెందుకు సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో ఓ లుక్కేసేయండి.

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts