బాలీవుడ్ నిర్మాతలకు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కాజల్..!

టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన వివాహమైన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు సౌత్ తోపాటు వార్తలను కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది ఈమె. పైగా బాలీవుడ్ లో కాజల్ కు సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అయినా కూడా కాజల్ కు సరైన సక్సెస్ రావడం లేదు ఈమధ్య.

తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇక మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వీటి కోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక హిందీలో కూడా ఒక సినిమాలో నటించబోతోంది. దాంతో కాజల్ కు మరొక అవకాశం కూడా హిందీలో నటించేందుకు వచ్చింది.టాలీవుడ్ లో ఒక సినిమాకి 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది.కానీ హిందీ లో మాత్రం 50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ హీరో తో నటించాలని కోరిక ఉండడంతో ఈమె అంత తక్కువ రేటుకి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది అన్నట్లుగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కానీ కొందరు అయితే మాత్రం బాలీవుడ్ లో అంత క్రేజ్ లేదు కాబట్టే ఆమె అంత రెమ్యూనరేషన్ అందుకుంటోంది అని కొట్టిపారేస్తున్నారు