తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!

November 30, 2021 at 10:33 am

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. పుష్ప సినిమా సోలో గా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పోటీలోకి వచ్చింది. ఆ సినిమాను కూడా అదే తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ సినిమాకు ఇండియాలో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే అందరికీ ఆసక్తే. ఈ సినిమా విడుదల వల్ల వాయిదా పుష్ప కలెక్షన్లకు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో పుష్ప వల్ల కూడా స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మూవీకి కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పుష్ప దెబ్బకు స్పైడర్ మ్యాన్ మూవీనే డేట్ మార్చుకుంది. తాజాగా ఆ సినిమా మేకర్స్ స్పైడర్ మ్యాన్ సినిమాను డిసెంబర్ 16వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి పుష్కరాజ్ దెబ్బకి భయపడి హాలీవుడ్ సినిమా సైతం ఒక రోజు ముందుకు వెళ్లింది.

తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts