బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!

November 30, 2021 at 10:51 am

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ అవ్వ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాల‌య్యతో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా ఎవరు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడీ అన్‌స్టాపబుల్ షో స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ షోకు తాజాగా 4 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఆహా టాక్ షోల‌లోనే అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా అన్‌స్టాప‌బుల్ రికార్డు సృష్టించింది. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ `బాల‌య్య వ‌ల్లే ఇది సాధ్యమైంది, బాల‌య్య‌ మ‌జాకా` అంటూ ఆయ‌న‌పై పొగ‌డ్త‌ల‌ వ‌ర్షం కురిపించేస్తున్నారు.

కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేశాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది.

 

బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts