చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య‌..ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది.

Acharya (2022) - IMDb

అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు జంట‌గా కీల‌క పాత్ర‌లు పోషించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డు ప‌డ‌టంతో షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. ఇక ఇటీవ‌లె చిత్రీక‌ర‌ణ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీనా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

ETHARKKUM THUNINDHAVAN - Release Date Announcement | Suriya | Sun Pictures | Pandiraj | D.Imman - YouTube

అయితే ఇప్పుడు అదే తేదీన వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న సూర్య కూడా వ‌స్తున్నాడు. చివ‌రిగా సూర్య న‌టించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు రెండీ ఓటీటీనే విడుద‌ల అవ్వ‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. ఈ నేప‌థ్యంలోనే సూర్య త‌న త‌దుప‌రి చిత్ర‌మైన `ఇతరుక్కుమ్ తునిందవన్` థియేర‌ట్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Chiranjeevi, Suriya to lend their voice for 'Ghazi'

సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. అయితే సూర్య తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున రిలీజ్ చేస్తుంటాడు. దీంతో ఫిబ్రవరి 4న‌ సోలోగా వ‌ద్దామ‌నుకున్న చిరంజీవికి.. సూర్య గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share post:

Latest