`పెళ్లి సందD` విడుద‌ల తేదీ ఖ‌రారు..ఆ హీరోల‌కు పోటీగా రోషన్!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్ర‌మే `పెళ్లి సందD`. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని క‌లిసి నిర్మించారు.

ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా మేక‌ర్స్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ స‌రికొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తాజా పోస్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు.

పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల గురించి ఈ విషయాలు మీకు తెలుసా

ప్ర‌స్తుతం ఈ న్యూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అక్టోబ‌ర్ 15 వ తేదీనే అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మ‌రియు నాగ శౌర్య `వ‌రుడు కావ‌లెను` చిత్రాలు సైతం విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి ఆ హీరోల‌కు రోష‌న్ ఏ మేర‌కు పోటీ ఇస్తాడ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.