ఓటిటీలో కొండపొలం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

మెగా వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే తాను నటించిన మొదటి సినిమా ఉప్పెన తోనే స్టార్ హీరో రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తన రెండవ సినిమా ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమానే కొండపొలం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ కలెక్షన్ల పరంగా కొంచెం నెమ్మదిగా సాగుతోందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అయిపోయిన ప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నెల అక్టోబర్ 8న దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనుంది. అంటే క్రిస్మస్ పండక్కి రావచ్చు అన్నమాట.