టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో నాని మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి తరుణంలో ఆయన చేస్తున్న ఓ భారీ రిస్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘శ్యామ్ సింగ రాయ్’ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించడమే అందరికీ షాక్ అని చెప్పాలి. ఇప్పటి వరకు నాని సినిమాలలో ఏదీ కూడా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలైంది లేదు. మరోవైపు గత కొంత కాలం నుంచీ నాని సరైన హిట్టే అందుకోలేకపోయాడు. ఇలా సమయంలో శ్యామ్ సింగ రాయ్ ను నాలుగు భాషల్లో విడుదల చేయడం ఎంత పెద్ద రిస్కో చెప్పక్కర్లేదు. అయితే ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మేకర్స్ మాత్రం భారీ మూల్యం చేల్లించుకోవాల్సిందే.