మహేష్ బాబు తన భార్యతో కలిసి దిగిన మొదటి ఫోటో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈయన బిజినెస్, తనకు కావలసిన వ్యవహారాలన్ని తన భార్య నమ్రతనే చూసుకుంటుందని విషయం అందరికి తెలిసిందే. అందుకే విరి జంట అంటే అభిమానుల్లో ఒక రకమైన అభిమానం ఉంటుంది. అందుచేతనే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.

ఇక వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటిసారిగా వంశీ సినిమాలో కలిసి నటించిన ఇద్దరు ఆ తర్వాత వివాహంతో ఒక్కటయ్యారు. మరి ఇదిలా ఉండగా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇద్దరు కూడా కెమెరా ముందుకి రావడం ఆసక్తికరంగా మారుతోంది. అదికూడా ఒక అర్జున్ ఫోటోకి మహేష్ మరియు నమ్రత కలిసి స్టైలిస్ట్ డ్రెస్సింగ్ లో అదరగొట్టారు.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి మొట్టమొదటి ఫోటోషూట్ కూడా ఇదేనట. దీంతో ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.