ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.. సమంత – ప్రీతం మధ్య బంధం ఇదే..!

నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సమంత తన ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతం తో నాలుగు సంవత్సరాల అనుబంధం ఉందని పోస్ట్ చేయడం వల్ల ఇతడి వల్లే ఆమె నాగచైతన్య దూరం చేసుకుంటోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంతకు స్టైలిస్ట్ ప్రీతం మధ్య సంబంధం కేవలం సోదరసోదరీ బంధం మాత్రమే అని తేల్చి చెప్పేసింది సమంత మేకప్ ఆర్టిస్ట్ అయినా సాధన సింగ్.

Samantha Makeup Artist Sadhana Strong Reply To Trolls About Preetham -  Sakshi

దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ స్పందించింది. సమంత-ప్రీతమ్‌ ల మధ్య ఉన్న బంధాన్ని అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని సాధనా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సమంతను.. ప్రీతమ్ అక్క(జీజీ) అని పిలుస్తాడు. జీజీ అంటే అర్ధం తెలుసు కదా..! అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా బదులిచ్చింది. “నాకు ఈరోజు షూట్ లేనందున.. దేవుడు నాకు తెలివిని ప్రసాదించడంతో.. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలనుకుంటున్నా” అని పేర్కొంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.