ద‌స‌రా స్పెష‌ల్‌..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!

October 15, 2021 at 12:31 pm

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

F3 Telugu Movie: Last But With Clear Plan

సునీల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మ‌రియు వ‌రుణ్ అభిమానుల‌కు ఓ స్పెష‌ల్ వీడియో రూపంలో సూప‌ర్ ట్రీట్ ఇచ్చింది.

Venkatesh, Varun Tej, Tamannaah and Mehreen Pirzada resume F3 shoot. Watch funny BTS video - Movies News

ఈ వీడియోలో ఎఫ్ 3 మూవీ సెట్స్‌లోని కొన్ని షూటింగ్ విజువల్స్‌ను చూపించారు. అలాగే ఈ వీడియో వెంక‌టేష్‌, వ‌రుణ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌, అనిల్ రావిపూడి, విజయ, ప్రగతి మ‌రియు త‌దిత‌రులు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌స‌రా విషెస్‌ను తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 

ద‌స‌రా స్పెష‌ల్‌..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts