ఈ రోజున మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం.. ముఖ్య అతిధి..?

 గత కొద్ది రోజుల కిందట మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఇందులో మంచు విష్ణు గెలుపొందాడు. అయితే ఈ రోజున ఉదయం 11 గంటలకు ఫిలింనగర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.

ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మంచు విష్ణు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆహ్వానం పంపారు. అందులో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణ తో పాటుగా కొందరు సీనియర్ నేతలు వద్దకు మంచు విష్ణు స్వయంగా వెళ్లి కలిశారు.

ఇక మరి కొంతమందికి ఫోన్ చేసి రమ్మని ఆహ్వానించినట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు అవ్వమని తెలియజేస్తున్నట్లుగా సమాచారం.అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు అవుతారని విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏది ఏమైనా ఎవరెవరు హాజరవుతారు వేచిచూడాల్సిందే.