డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

 ‘కొండపొలం’ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు చిరంజీవి మంచి కథ ఉంటే.. క్రిష్‌తో నెక్ట్స్ సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. త్వరలో వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళితే చూడాలనుకునే అభిమానులున్నారు. క్రిష్.. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)

అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. క్రిష్ తాజాగా తెర‌కెక్కించిన చిత్రం `కొండపొలం`. ఈ మూవీలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించింది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన కొండ‌పొలం న‌వ‌ల‌ను ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది.

 ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేసినట్టు క్రిష్ మీడియాకు తెలిపారు. Photo : Twitter

అయితే తాజాగా ఈ చిత్రం చూసిన చిరంజీవి.. కొండ‌పొలంపై ప్ర‌శంస‌లు కురిపించారు. క్రిష్ సినిమాను ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని, వైష్ణ‌వ్ తేజ్ పెర్ఫామెన్స్ కానీ, క్యారెక్ట‌రైజేష‌న్ కానీ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయ‌ని చిరు చెప్పుకొచ్చారు. మంచి మెసేజ్‌తో కూడిన ల‌వ్‌స్టోరి అని చిరు రివ్యూ ఇచ్చారు. అంతేకాదు, కొండ‌పొలం సినిమాకు ఫిదా అయిన చిరు.. త‌న కోసం ఓ మంచి క‌థ సిద్ధం చేయ‌మ‌ని క్రిష్‌కి చెప్పిన‌ట్టు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇదే నిజ‌మైతే త్వరలో వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతుంది.

Share post:

Latest