సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య కూడా కొడుకును ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది బాలయ్య చెప్పుకొచ్చారు.
అంతేకాదు, `ఆదిత్య 999 మాక్స్` అని టైటిల్ కూడా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. కనీసం ఈ సినిమాకు సంబంధించి ఏ విషయమూ తెరపైకి రావడం లేదు. దాంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అసలు మోక్షజ్ఞ సినిమాల్లో వస్తాడా..? లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ అసలు నటనపైనే ఆసక్తి చూపించడం లేదట.
సొంతంగా బిజినెస్ చేసుకోవాలని, బిజినెస్‌మేన్‌గానే సిటిల్ అవ్వాలని మోక్షజ్ఞ భావిస్తున్నాడట. బాలయ్య ఎంత చెబుతున్నా తన మనసును మార్చుకోవడం లేదట. ఇక కొడుకు తీరుతో విసిగిపోయిన బాలయ్య.. చివరి ప్రయత్నంగా న్యూయార్క్‌లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకోవడానికి మోక్షజ్ఞను అమెరికాకు పంపించబోతున్నారట. అక్కడికి వెళ్తే అయినా నటనపై ఆసక్తి కలుగుతుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంత నిజమో తెలియాల్సి ఉంది.