బన్నీ వాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ.. ఎందుకో తెలుసా?

బన్నీ వాసు ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు గీత ఆర్ట్స్ 2. ప్రొడ్యూసర్ బన్నీ వాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా సునీత బన్నీ వాసు పై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని, అంతే కాకుండా ఆ భాషను కూడా చేయించారని, ఈ విషయంపై రెండేళ్లుగా తనకు న్యాయం చేయాలని పోరాడుతున్న అని చెప్పుకొచ్చింది సునీత.

సోమవారం పోలీసుల స్పందనా కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప కలిసి ఆమె ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరింది.ఈ విషయంపై ఎస్పీ ఆదేశాల మేరకు సునీత అలాగే ఆమె తల్లి పార్వతమ్మ ను దిశా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు విచారణ చేసి అనంతరం డిఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, సంబంధించి ఆమె ఆధారాలను అందిస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఇక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.