`అన్ స్టాపబుల్` ఒప్పుకోవ‌డానికి కార‌ణం అదే అంటున్న బాల‌య్య‌!

October 14, 2021 at 6:30 pm

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ ప‌లువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Image

కొద్దిసేపటి క్రిత్రమే జ‌రిగిన ఈ కార్య‌క‌ర్ర‌మంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలోను ఒక ప్రయాణం ఉంటుంది.

Image

ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని అధిహమించి ఒక లక్ష్యాన్ని చేరడమే “అన్ స్టాపబుల్“. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది .. అందుకే హోస్ట్‌గా చేయడానికి ఒప్పుకున్నాను` అంటూ బాల‌య్య చెప్పుకొచ్చారు. కాగా, బాల‌య్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది.

Image

`అన్ స్టాపబుల్` ఒప్పుకోవ‌డానికి కార‌ణం అదే అంటున్న బాల‌య్య‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts