‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూప‌రంతే..!!

October 14, 2021 at 6:51 pm

టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా చేయ‌బోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్ర‌సారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Image

ఈ ఈవెంట్‌లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే `అన్ స్టాపబుల్`.

Image

ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా.. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా.. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా.. కలుద్దాం `ఆహా` లో అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా విడుద‌లు చేసిన ఈ టాక్ షో ప్రోమో సూప‌ర్ గా ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, కాగా, బాల‌య్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది.

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూప‌రంతే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts