న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ.. కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేశారు.
మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక మరో విషయం ఏంటంటే.. శ్యామ్ సింగరాయ్‌ను డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై బాగానే అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను నాని అందుకుంటాడో..లేదో..తెలియాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.