చైతో విడాకులు నిజ‌మే..? స‌మంత ట్వీట్‌తో వ‌చ్చేసిన క్లారిటీ..!

September 14, 2021 at 8:54 am

గ‌త కొద్ది రోజుల‌గా స‌మంత‌-నాగ‌చైత‌న్యల విడాకుల వ్య‌వ‌హారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. చైతో స‌మంత‌కు చెడింద‌ని.. అందుకే వీరిద్ద‌రూ విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు హాట్‌ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్‌ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు.

Samantha Ruth Prabhu's cold reaction to Naga Chaitanya's Love Story trailer adds more fuel to divorce rumours – view tweet

దాంతో ఆ వార్త‌లే నిజ‌మ‌ని చాలా మంది న‌మ్మేస్తున్నారు. పైగా ఆ వార్త‌ల‌కు బ‌లానిచ్చేలా స‌మంత చేస్తున్న పోస్టులు మ‌రిన్ని అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా స‌మంత చేసిన ఓ ట్వీట్ విడాకుల‌పై ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన‌ట్టైంది. నాగయ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ల‌వ్‌స్టోరి` మూవీ ట్రైల‌ర్ నిన్న విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

Samantha and Naga Chaitanya celebrate 3 Years of Marital Bliss; Love Story in PICS | The Times of India

ఇక లవ్ స్టోరీ అప్డేట్ల మీద అప్పుడ‌ప్పుడు స్పందించే సమంత.. నాగ చైతన్య గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది. కానీ తాజా ట్రైలర్ మీద స్పందిస్తూ చైతన్య గురించి ఏ ముక్క కూడా చెప్పలేదు. చైతన్య ట్వీట్‌‌కే రిప్లై ఇచ్చిన స‌మంత‌.. ‘విన్నర్!! ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ సాయిపల్లవి` అని పేర్కొంది. ఈ ట్విట్‌లో స‌మంత‌ క‌నీసం చైతు పేరు కూడా మెన్ష‌న్ చేయ‌లేదు. దాంతో చైతును సమంత పక్కన పెట్టేసిందని.. వీరి విడాకులు నిజ‌మే అంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

చైతో విడాకులు నిజ‌మే..? స‌మంత ట్వీట్‌తో వ‌చ్చేసిన క్లారిటీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts