ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?

September 14, 2021 at 9:15 am

బాలీవుడ్ నటుడు విద్యుత్‌ జమ్వాల్ ఇప్పటికి ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతా నీతో నిశ్చితార్థం జరిగింది. ఖైదీ విషయాన్ని అతను సెప్టెంబర్ 13 తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా అతడు షేర్ చేశాడు. అంతేకాకుండా తనకు కాబోయే భార్య చేతులు పట్టుకొని మరీ రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఇది కమాండో మార్గం 01/09/2021 అనే కాప్షన్ నువ్వు జోడించారు.

అయితే విద్యుత్‌ జమ్వాల్ ప్రస్తుతం వయసు 40 ఏళ్ళు. అంతే కాకుండా అతడు వివాహం చేసుకోబోయే నందిత వయస్సు కూడా 40 ఏళ్ళు కావడం విశేషం. ఆమె కూడా వారిద్దరి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.విద్యుత్‌ జమ్వాల్ తుపాకి సినిమాతో తెలుగు అలాగే తమిళ ప్రేక్షకులకు పరిచయమే. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఇతను సనక్,ఖుదా హపీజ్ చాప్టర్-2 లాంటి బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts