నూటొక్క జిల్లాల అందగాడు సినిమా..అదిరిపోయే రేటుకు కొన్న ఓటీటీ..?

ప్రముఖ నటుడు , రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ హీరో గా , రుహాని శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు . రచ్చ కొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ,ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, ఏ వి సి, ఎఫ్ ఎఫ్ ఐ బ్యానర్లపై శిరీష్, రాజీవ్ రెడ్డి , సాయి బాబు జాగర్లమూడి లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. అంగరంగ వైభవంగా సెప్టెంబర్ 3వ తేదీన ఈచిత్రం థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ ను అందుకుంది.కానీ కలెక్షన్లు మాత్రం తక్కువగానే వస్తున్నాయి.Amazon Prime Tops 150 Million Members - Variety

ఇక దీనితో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా రన్ అవుతోంది ఈ చిత్రం. ఇకపోతే ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీకి అమ్మేసినట్లు తెలుస్తోంది . ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో నూటొక్క జిల్లాల అందగాడు చిత్రం స్ట్రీమ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు.. డిజిటల్ రైట్స్ ఐదు కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇక శాటిలైట్ హక్కులు కూడా బాగా మంచి దొరికే అమ్ముడయ్యాయి. థియేట్రికల్ పరంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్ పరంగా నిర్మాతలు లాభాలు పొందుతున్నట్లు సమాచారం.