పవన్ సినిమాకు టైటిల్‌తో సంబంధం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ చేయబోతున్న సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ కొద్ది క్షణాల ముందు అనౌన్స్ చేశారు. అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఈ టైటిల్ పోస్టర్ విపరీతంగా నచ్చింది.

కానీ మెజారిటీ సినీ ప్రేమికులకు ఈ సినిమా టైటిల్ విషయంలో పలు అనుమానాలు సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్ ఎంతమేర యాప్ట్ అవుతుందని వారు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ ఓ లెక్చరర్ పాత్రలో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తోంది. అలాంటి ఆయన ఈ సినిమా టైటిల్‌కు ఎంతవరకు న్యాయం చేయగలడని వారు ప్రశ్నిస్తున్నారు. అటు భగత్ సింగ్ టైటిల్ వాడుతున్నప్పుడు పవన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఈ సినిమాలో ఆయన పాత్రతో భగత్ సింగ్ పేరు వాడకాన్ని ఎలా సమర్ధిస్తారు అనే ప్రశ్నను క్రిటిక్స్ వ్యక్త పరుస్తున్నారు.

మరి నిజంగానే ఈ సినిమాకు టైటిల్‌తో సంబంధం లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాను కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దితే, భగత్ సింగ్ లాంటి ఓ ఉద్యమకారుడి పేరు ఎందుకు వాడటం అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో వెంకటేష్ కూడా ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రంతో ఇలాంటి ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందా అని ప్రేక్షకులు భయపడుతున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.