నేను హీరోనే కాదంటున్న పవన్ కళ్యాణ్..! కారణం..?

పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక రాజకీయాలలోకి కలుపుమొక్కలను ఏరు వేయాలని అడుగు పెట్టాను అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. తాను నటుడు అవ్వాలని ఎప్పుడూ తన కోరిక లేదని.. కేవలం సినిమాలంటే ఇష్టం ఉండడం చేత గత్యంతరం లేక నటిస్తున్నానని తెలియజేస్తున్నాడు.

జనసేన కార్యవర్గ సమావేశంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనని హీరో లాగా ఎవరు చూడవద్దని తను సామాన్య మనిషి లాగానే నా జీవితం కొనసాగిస్తూ ఉంటానని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో తెలియజేశాడు. అంతే కాకుండా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నేను హీరో గా చేయవలసి వస్తోంది.

ఇక అంతే కాకుండా తనని ఎవరైనా ఏమైనా అంటే క్షమించె ప్రసక్తి లేదని ఖచ్చితంగా వాళ్లకు చుక్కలు చూపిస్తాం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నేను కూడా సామాన్య పౌరుడిగానే ఈ ప్రశ్న వేస్తున్నాను అన్నట్లుగా తెలియజేశాడు పవన్ కళ్యాణ్.