మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాస్ మహారాజా..!

మెగాస్టార్ ఆచార్య సినిమా తరువాత తెరకెక్కిస్తున్న సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నాడు.. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో వాల్తేరు వీర్రాజుగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి ని మాస్ ప్రేక్షకులు ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో.. ఇది అదే తరహాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి దర్శకుడు బాబి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్నట్లు సమాచారం.

GodFather Motion Poster Out! Here's a Glimpse Into Chiranjeevi's 153rd Film  (Watch Video) | ? LatestLY

ఇకపోతే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. బాబి తో రవితేజ ఇదివరకే పవర్ సినిమాను చేశాడు.. రవితేజ ,చిరంజీవి తో కూడా అన్నయ్య సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ లో కూడా ఒక సాంగ్ లో కనిపించాడు . మళ్లీ ఇన్ని సంవత్సరాలకు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రలో రవితేజ కనిపించనున్నాడట.. ఇక త్వరలోనే ఈ సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టేసి , వచ్చేది ఎండాకాలం లోపు విడుదల చేయాలని సమాచారం.