జర్నలిస్ట్ గా మారిన విజయ్ దళపతి.. అందుకేనా..?

విజయ్ దళపతి.. తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల లిస్టులో కూడా ఆయన పేరును నమోదు చేయించుకున్నాడు.. ప్రస్తుతం దక్షిణాది బాగా డిమాండ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దళపతి, ఇటీవల తెలుగు లో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకొన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కథ మొదట మహేష్ బాబు కు వినిపించగా, మహేష్ బాబు మార్పులు చేయాలని చెప్పాడు.. కానీ దర్శకులు ఒప్పుకోలేదు..

ఇక ఈ సినిమా కథను విజయ్ వరకు వెళ్లగా..కథ విన్న వెంటనే స్పాట్ లో ఓకే చెప్పేసాడు. అంతే కాదు తెలుగు ప్రేక్షకులకు అనువుగా విజయ్ మేక్ ఓవర్ ను కూడా మార్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ, మరోపక్క విజయ్ దళపతి కి 100 కోట్లు రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఈయన అడ్వాన్స్ గా కొంత రూపంలో చెక్కు కూడా ఇచ్చారట.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తాత్కాలికంగా # దళపతి 66 అనే టైటిల్ ని కూడా పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా కనిపించబోతున్నారు. కానీ అడవులను నాశనం చేయటం , ప్రకృతి వనరులని పాడు చేయడం చూసిన విజయ్ చలించిపోయి ఒక జర్నలిస్టుగా మారతారు. ఆపై గ్లోబల్ వార్మింగ్ పై ఆయన గళం ఎత్తబోతున్నారని సమాచారం. సినిమా మొత్తం చుట్టూ గ్లోబల్ వార్మింగ్ చుట్టూ సాగుతుందని సమాచారం.