మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల ఆరోజే..!

September 28, 2021 at 9:14 pm

అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి.. ఎందుకంటే లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ నైనా విడుదల చేస్తారా లేదా అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు..

దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 30వ తేదీన సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించింది.. అంటే గురువారం రోజు విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు .. ఇక అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

 

 

మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల ఆరోజే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts