గుంటనక్క అంటే ఎవరు మాస్టర్ చెప్పండి ప్లీజ్.. యాంకర్ రవి కన్నీరు మున్నీరు?

September 28, 2021 at 8:57 pm

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్బాస్ నాలుగో వారంలో కి ఎంట్రీ ఇవ్వబోతోంది. బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి.. చివరికి క్షమించండి అంటూ చేతులు జోడించి మరీ తల్లి, ప్రియా, లహరి లో క్షమాపణ కోరాడు రవి. నిన్నటి వరకు తాను తప్పు చేయలేదని మొత్తం ప్రియనే చేసిందని మాట్లాడిన రవి కెమెరాలకు అడ్డంగా దొరికి ఎడంతో ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మాట్లాడుతున్నాడని, అంతేకాకుండా ఈ వారం నామినేషన్లను ఉండటం కాయం అవడంతో సింపతి గేమ్ మొదలుపెట్టాడు అంటూ నెటిజన్లు రవి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరోవైపు నట్రాజ్ మాస్టర్ యాంకర్ రవి మొగుడిలా తగులుకున్నాడు. ఇతను ఒక గుంట నక్క అంటూ ఇన్ డైరెక్ట్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా ఎవరు మాస్టర్ గుంట అక్క అని పదే పదే అనడంతో ఆ గుంట నక్క ఎవరో కాదు యాంకర్ రవి అనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి నామినేషన్స్ లో గుంట నక్క అని ఎవరిని అన్నారు మాస్టర్ అని రవి అడగగా నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటావ్ అని నటరాజ్ మాస్టర్ రవి నీ అని ఇరికించేసారు.

తాజా ప్రోమో లో యాంకర్ రవి ఈ గుంటనక్క ఇష్యూపై నటరాజ్‌తో చర్చిస్తూ కనిపించాడు. పికాక్ ఎగిరిపోయింది అని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశారు నటరాజ్ మాస్టర్. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా నిజం చెప్పండి మాస్టర్ ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు నాకు ఎలానో ఉంటుంది అని ఎమోషనల్ అయ్యాడు రవి.

గుంటనక్క అంటే ఎవరు మాస్టర్ చెప్పండి ప్లీజ్.. యాంకర్ రవి కన్నీరు మున్నీరు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts