అఖండ లిరికల్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. పూర్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఇంతకు ముందే బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కూడా వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా నందమూరి అభిమానులకు, ఈ చిత్ర బృందం సర్ప్రైస్ ను ఇచ్చింది. హోండా సినిమా నుంచి మొదటి పాట అడిగా.. అడిగా.. అన్న లిరికల్ వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం అనగా సెప్టెంబర్ 18 న 5:33 లకు విడుదల చేయనున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.