కోర్టులో తేల్చుకుంటా అంటు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమంత..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అంటే.. ప్రత్యేకంగ ఎవరికీ చెప్పనవసరం లేదు.ఈ కుటుంబానికి ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఇక వీరి కుటుంబంలో కి లక్కీ గర్ల్ గా సమంత ఎంట్రీ ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు.నాగచైతన్య సమంత అక్టోబర్ 7 న 2017 తేదీన వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.నాగచైతన్య సమంత తన ఇమేజ్ కాస్త రెట్టింపు అయింది అని చెప్పుకోవచ్చు.

అక్కినేని కోడలు సమాజంలో గౌరవం పొందిన సమంత.. ఈ ఆనందాలన్నీ మూన్నాళ్ళ ముచ్చటే అని అంటున్నారు. సమంతాకి,అక్కినేని ఫ్యామిలీకి ఈమధ్య పొంతన కుదరలేదు అన్న పుకార్లు వస్తున్నాయి.ఈ ఫ్యామిలీ నుండీ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ విషయంపై ఇంతవరకు అక్కినేని ఫ్యామిలీ,సమంత ఫ్యామిలీ ఎవరు స్పందించకపోవడం నిజమనే వార్తకు దారితీస్తోంది. ఇక మెయిన్స్ట్రీమ్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలు రావడంతో సమంత అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.సమంత ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియక తన లీగల్ టీంకి సలహా కోరినట్లు సమాచారం. అవసరం అయితే మీడియాలో వార్తలు రాకుండా కోర్టు మెట్లు ఎక్కాలి అని సమంత తన లీగల్ టీంతో చెప్పినట్లు సమాచారం.

అయితే ఇక్కడ మాత్రం అక్కినేని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి విచారణ ఇస్తే అయిపోయే దానికి ఇలా కోర్టు మెట్లు ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తారు.