`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్‌..?!

September 15, 2021 at 9:55 am

నాగ‌చైత‌న్య అక్కినేని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది.

How Love Story team completed shoot without a single case of Coronavirus?

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ఈ ట్రైల‌ర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ట్రైల‌ర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు. ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సర్` అంటూ చైతు చెప్పే డైలాగ్ బాగా ఆక‌ర్షించింది.

Love Story: Naga Chaitanya and Sai Pallavi to resume shoot on September 7? - Movies News

అయితే ఇప్పుడు ఈ డైలాగే చిత్ర యూనిట్‌కు ముప్పుగా మారింది. గొర్లు, బర్లు ఇస్తూ వాళ్లను అంతకంటే పైకి ఎదగనివ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని టీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్షాలు ఎప్ప‌టి నుంచో చేస్తున్న‌ ఆరోపణ. ఇప్పుడు అందుకు త‌గిన‌ట్టుగానే ల‌వ్‌స్టోరీలో డైలాగ్ పెట్ట‌డంతో.. ప‌లువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అవుతూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళూ సర్కార్ పథకాల పై సెటర్స్ వేసేవాళ్ళే అంటూ ల‌వ్ స్టోరీ చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. మ‌రి దీనిపై మేక‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts