దమ్ముంటే కాస్కోండి అంటూ సవాల్ విసురుతున్న నటి..!

September 15, 2021 at 10:05 am

ఇటీవల చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువవుతోంది అనే తరుణంలో ఇటీవల నెటిజన్ల నుంచి కూడా సెలబ్రిటీలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నారు.. దిక్కుమాలిన పదాలతో నెటిజన్లు కూడా సెలబ్రిటీలను చాలా అవమాన పరుస్తున్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా నెటిజన్ల నుంచి రకరకాల మాటలతో చాలా ఇబ్బంది పడుతోందట.

ఇందుకు గల కారణం ఏమిటంటే , ఒక రియాల్టీ షోలో ఒక మేల్ యాక్టర్ ను ఆమె ఒక మూలన కూర్చో అని అనడంతో, అతని ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఆమెను విపరీతంగా ట్రోల్ కి గురిచేస్తున్నారు. అయితే ఆమె అప్పటి వరకు మౌనంగా ఉండి, ఇప్పుడు డైరెక్ట్ గా అతని ఫ్యాన్స్ కు సవాల్ విసురుతోంది.. సింగరేణి కాలనీ లో ఉన్న చైత్ర అనే పాప కోసం మీరు నన్ను తిట్టే టైంలో సగం సమయాన్ని కూడా ఆ పాప కోసం ఎందుకు కేటాయించడం లేదు.. ఒకవేళ మీరు మగాళ్ళు అయితే ఆ పాప కుటుంబానికి తగినంత సహాయం చేసి చూపించండి.. నేను అక్కడికే వెళుతున్న దమ్ముంటే కాస్కోండి అంటూ ఆమె ఆ యాక్టర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి చెప్పింది. అయితే ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో తెలుసుకోవడానికి కొద్ది రోజులు ఆగక తప్పదు.

 దమ్ముంటే కాస్కోండి అంటూ సవాల్ విసురుతున్న నటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts