ఈ ఆరడుగుల బుల్లెట్టు ను.. కాస్త పట్టించుకోండయ్యా అంటున్న నిర్మాతలు..?

September 15, 2021 at 9:44 am

టాలీవుడ్ లో గోపీచంద్ హీరోగా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కాడి 2017 సంవత్సరంలో ఒక సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా కొన్ని కారణాల చేత ఇంకా ఇప్పటికి విడుదల కాలేదు.. ఆ సినిమానే ఆరడుగుల బుల్లెట్.. ఈ సినిమా చాలా వరకు జనాలు మరిచిపోయారు.

ఇక ఈ సినిమాని ఆ మధ్యకాలంలో ఓటీటిలో విడుదల చేస్తారని ప్రచారం జరగగా.. ఇక ఓటీటీ వారు కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ చిత్రం ఆగిపోయింది ఈ సినిమాకి సంబంధించి క్లియరెన్స్ పేపర్లు అవ్వలేదంట. ఇక ఆ నిర్మాతలు వాటన్నిటినీ క్లియర్ చేసుకొని వచ్చే సమయానికి ఓటీటి సంస్థలు పక్కన పెట్టేసి ఈ సినిమాని.

ఇక ఈ సినిమాలు నిర్మించిన నిర్మాతలు ఎంత కష్టపడ్డా కూడా అది వృథాగా పోతోంది. ఈ సినిమాని మొదట థియేటర్లో విడుదల చేసి.. ఆ తర్వాత ఓటీటి లో విడుదల చేయాలనుకుంటే.. ఈ సినిమాకి నాలుగు కోట్ల మించి బిజినెస్ కాలేదట. ఇక ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఈ సినిమా 8 కోట్ల బిజినెస్ చేస్తుందని ఆశిస్తే.. 4 కోట్ల రూపాయల వరకు మాత్రమే జరిగింది.

ప్రస్తుతం గోపీచంద్ నటించిన సిటీమార్ చిత్రం కలెక్షన్ల పరంగా బాగుండడంతో.. ఈ ఆరడుగుల బుల్లెట్ సినిమాను కూడా అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.. అయితే ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తారా.. ఓటిటీలో విడుదల చేస్తారనే విషయం ఇంకా తెలియడం లేదు.

ఈ ఆరడుగుల బుల్లెట్టు ను.. కాస్త పట్టించుకోండయ్యా అంటున్న నిర్మాతలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts